నోటిపూత సమస్యకు సింపుల్ చిట్కాలు!

39
- Advertisement -

చాలామందిని నోటిపూత వేధిస్తూ ఉంటుంది. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నోటిపూత సమస్యను ఎదుర్కొనే ఉంటారు. కొందరిలో ఈ సమస్య చాలా అరుదుగా కనిపిస్తుంది. మరికొందరు తరచూ వేధిస్తూ ఉంటుంది. దీని కారణంగా సరిగా ఆహారం తినలేరు. ఇంకా నోటి నుంచి దుర్వాసన, నోరు పొడిబారినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ నోటిపూత తీవ్రమైన నోటిపుండ్లకు దారి తీసే అవకాశం ఉంది. ఈ సమస్య రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నోటి శుభ్రత లేకపోవడం, కొన్నిసార్లు తినే ఆహారం పడకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత.. వంటివి నోటిపూత రావడానికి ప్రధాన కారణాలు. .

ఇంకా నిమ్మ, బత్తాయి, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను అధిక మోతాదులో తీసుకున్న నోటిపూత ఏర్పడుతుంది. అయితే చాలమంది నోటిపూత వచ్చినప్పుడు సాధారణ సమస్యగానే భావిస్తారు. అందువల్ల దానిని పోగొట్టుకునేందుకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోరు. అయితే దీని పట్ల జాగ్రత్త వహిస్తూ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలా త్వరగా నోటిపూత కు చెక్ పెట్టవచ్చు. దీనిని తగ్గించడానికి తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా తేనె పసుపు కలిపి నోటిపూత ఏర్పడిన ప్రదేశంలో అప్లై చేస్తే త్వరగా తగ్గిపోతుంది.

ఇంకా నాలుగైదు తులసి ఆకులను నోట్లో వేసి నమిలిన నోటిపూత వేగంగా తగ్గిపోతుందట. ఇంకా నోటిపూత ను తగ్గించడానికి కొబ్బరి నూనె కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ ల కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని ఉదయం సాయంత్రం రెండేసి సార్లు పుక్కిలిస్తే ఈ సమస్య తగ్గుతుంది. ఈ చిట్కాలతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ప్రతిరోజూ నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా తినే ఆహారలో మసాలా దినుసులను తగ్గించాలి. నీరు ఎక్కువగా తాగాలి. ఇలా చేస్తే నోటిపూత వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:కాంగ్రెస్ లో మంటపెట్టిన రేవంత్!

- Advertisement -