అందమైన కళ్ల కోసం ఇంటి వైద్యం….

253
- Advertisement -

టీ స్పూన్ టమాటో గుజ్జును ,చిటికెడు ,అర టీ స్పూన్ నిమ్మరసం ,ఒక టీ స్పూన్ శనగ పిండిని తీసుకొని మెత్తగా ఒక మిశ్రమాన్ని తయారు చేసుకొని కనురెప్పులపై రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత కడుక్కోవాలి . ఇలా చేస్తే కళ్ళు కాంతివంతంగా తయారవుతాయి.

రోజుకు 4 సార్లు ముఖం కడుక్కోవాలి . అలివ్ నూనె , పసుపు పొడి కలిపి ముద్దగా చేసుకొని కళ్ల కింది నల్లని చారల పై రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నల్లని చారలు తొలగిపోతాయి.

విటమిన్ “ఇ” నూనె తో కళ్ళకింది చారల పై మెల్లగా మసాజ్ చేయాలి. నిద్ర పోయే ముందు కంటి ని రోజూ మంచినీళ్ళుతో శుభ్రం చేయాలి.

అర టీ స్పూన్ కీర రసం లో కొద్దిగా రొజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకొని అరగంట సేపు ఉంచి ఆతర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి.

రోజుకు 6 గంటలు నిద్రపోవడం వల్ల కళ్లు సరిగ్గా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: IPL 2023 : ఆర్సీబీ ప్లే ఆఫ్ కు వెళ్తుందా ?

కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాలమీగడతో ముడతలు ఉన్న చోట మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గ్లాస్‌ నీటిలో రాత్రి ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్లను కడుక్కుంటే కళ్లు తాజాగా మెరుస్తాయి.

ఉదయం పూట నాలుగు బాదం పప్పులను అర గ్లాస్ పాలలో నానపెట్టాలి. రాత్రి పూట ఆ బాదం పప్పును ముద్దగా చేసుకొని కళ్ళ చుట్టూ రాస్తే నల్లగా ఉన్న వలయాలు తగిపోతాయి.

కళ్ళ కిందభాగం ఉబ్బినట్టు ఉంటే రెండు గ్రీన్ టీ బ్యాగులను వేడినీటిలో కొంచెం సేపు ముంచి ఆ తర్వాత వాటిని కళ్ల మీద 20 నిమిషాలపాటు పెట్టుకోవాలి. ఇలా చేస్తే కాంతివంతంగా తయారవుతాయి.

- Advertisement -