దులీప్ ట్రోఫీకి తిలక్ వర్మ దూరం!

4
- Advertisement -

ఆసియా కప్ 2025లో చోటు దక్కించుకున్నాడు స్టార్ ఆటగాడు తిలక్ వర్మ. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీకి దూరం కానున్నాడు. నార్త్‌జోన్‌తో జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్‌కు తిల‌క్ వ‌ర్మ నాయ‌క‌త్వం వ‌హించాల్సి ఉంది. అయితే ఆసియా కప్‌కు తిలక్ ఎంపిక కావడంతో అతడి స్థానంలో కేర‌ళ బ్యాట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లను అప్ప‌గించారు.

త‌మిళ‌నాడుకు చెందిన ఎన్ జ‌గ‌దీశ‌న్‌ను వైస్ కెప్టెన్‌గా నియ‌మించారు. ఈ మ్యాచ్ సెప్టెంబ‌ర్ 4 నుంచి 7 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. తిల‌క్‌, సాయి కిషోర్‌ స్థానంలో అంకిత్ శర్మ‌, షేక్ రషీద్ లను సౌత్ జోన్ సెలెక్ట‌ర్లు ఎంపిక చేశారు.

Also Read:సీఎంగా చంద్రబాబు.. నేటికి 30 ఏళ్లు!

సౌత్‌ జోన్ జట్టు ఇదే..

మహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలే, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, త్రిపురాన విజయ్, తనయ్ త్యాగరాజన్, విజయ్‌కుమార్ వ్యాషాక్, నిధీష్ MD, రికీ సింఘ్నేత్, జికర్నెట్, జికర్నెట్, జికర్నెట్, భుయీ అంకిత్ శర్మ, షేక్ రషీద్.

- Advertisement -