వన్డేలకు తిలక్‌ వర్మ దూరం..

6
- Advertisement -

భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరిగే తొలి మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. జనవరి 21, 23, 25 తేదీల్లో జరగనున్న ఈ మ్యాచ్‌లలో ఆయన ఆడలేడని బీసీసీఐ స్పష్టం చేసింది. రాజ్‌కోట్‌లో జనవరి 7 (బుధవారం)న తిలక్ వర్మకు టెస్టిక్యులర్ టోర్షన్ సమస్యకు శస్త్రచికిత్స (సర్జరీ) నిర్వహించినట్లు బోర్డు తెలిపింది.

బీసీసీఐ ప్రకటన ప్రకారం, తిలక్ వర్మ గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శుక్రవారం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకునే దశ సక్రమంగా కొనసాగుతోందని వెల్లడించింది.

లక్షణాలు పూర్తిగా తగ్గిన తర్వాత, గాయం పూర్తిగా మానిన అనంతరం మాత్రమే తిలక్ మళ్లీ శిక్షణతో పాటు నైపుణ్యాభ్యాసాలను ప్రారంభిస్తాడని బీసీసీఐ పేర్కొంది. జనవరి 28న విశాఖపట్నంలో, జనవరి 31న త్రివేండ్రంలో జరిగే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు తిలక్ వర్మ అందుబాటులో ఉండగలడా అనే విషయాన్ని, ఆయన పురోగతిని బట్టి మధ్యంతర కాలంలో సమీక్షిస్తామని బోర్డు తెలిపింది.

Also Read:అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రం లీక్!

- Advertisement -