టిక్ టాక్ ఫిలిం ఫెస్టివల్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

314
Tik Tok Film Festival
- Advertisement -

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఇప్పడు ఎవరి ఫోన్ లో చూసిన ఖచ్చితంగా టిక్ టాక యాప్ ఉంటుంది. ఈ యాప్ కు జనాలు బాగా అట్రాక్ట్ అయ్యారు. ఈయాప్ వల్ల చాలా మంది సెలబ్రెటీలు కాగా, మరికొంత మంది ప్రాణాలు తీసుకున్నారు. ఇంకా కొంత మంది అయితే తమ ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందురు తమ టాలెంట్ ని ఇందులో చూపిస్తున్నారు . టిక్ టాక్ ప్రియులను ఎంకరేజ్ చేసేందుకు టిక్ టాక్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.

కానీ ఇది హైదరాబాద్ లో కాదు లేండి.. పుణేలో. దీనికి సూరజ్‌ లోఖండే, ప్రకాశ్‌ యాదవ్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఈఫెస్టివల్ ను నిర్వహించారు. ఈ ఫిల్మ్‌ఫెస్టివల్ జులై 24న ప్రారభం అయింది . ఆగస్టు 20వ తేదిన ముగుస్తుంది . కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి తాము ఈటిక్ టాక్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించినట్లు తెలిపారు నిర్వహాకులు.

దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమి లేదు . ఎవరైనా పోటి పడవచ్చు . అయితే ఇందులో మొత్తం 12 కేటగిరీలు ఉంటాయి. ఇందులో గెలిచినందుకు గాను మొదటి బహుమతి రూ.33,333. రెండో బహుమతి రూ. 22,222, మూడో బహుమతి రూ.5,555, నాలుగో బహుమతి రూ.3,333 గా ఇస్తునట్లు ప్రకటించారు . ఇంతే కాకుండా సర్టిఫికేట్ మరియు అవార్డులను అందించనున్నట్లు తెలిపారు.

- Advertisement -