బన్నీకి అభిమానిగా మారిన బాలీవుడ్‌ హీరో..

213
- Advertisement -

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉండబోతుందని సమాచారం. అయితే వీరిద్దరి కాంటినేషన్‌లో సినిమా ఎప్పుడు మొదలుకాబోతుంది మాత్రం క్లారిటీ లేదు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘సోనూ కే టీటూ కి స్వీటీ’ ని రీమేక్ చేయాలని త్రివిక్రమ్ భావించినా ఆ కథలో పలు మార్పులు చేర్పులను బన్నీ అండ్ టీం చెప్పారంటూ సమాచారం.

Tiger Shroff

అయితే ఇలాంటి సమయంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాప్ హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్ అంటే ఎంతో అభిమానం అని తెలిపాడు. అల్లు అర్జున్ స్టైల్‌ను తాను అభిమానిస్తానని నాకు అల్లు అర్జున్‌తో కలిసి నటించాలనే కోరిక ఉందని కూడా టైగర్ వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

బన్నీ ఇప్పటికే యూట్యూబ్‌తో హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. అందుకే టైగర్‌,బన్నీ కలిసి తెలుగు, హిందీ మూవీని చేస్తే మంచి ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో వీరిద్దరి కలయికలో మూవీకి భారీ ఆధరణ లభిస్తుందని సిని వర్గాల బోగట్టా. అలా కాకున్నా సోనూ కే టీటూ కి స్వీటీ చిత్రంలో మరో హీరో పాత్రకు అయినా టైగర్ ను తీసుకుంటే బాగుంటుంది సినీజనాల అభిప్రాయం. మరి ఈ ప్రాజెక్ట్‌పై అల్లు అర్జున్‌ ఏమంటాడో చూడాలి.

- Advertisement -