చరణ్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్?

32
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఉప్పెన మూవీ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు ఈ కథ పైన పూర్తి ఫోకస్ పెట్టి పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేశారట. మొదట ఈ కథను ఎన్టీఆర్ కు వినిపించగా.. ఈ కథ తన కంటే బాగా రామ్ చరణ్ కు సెట్ అవుతుందని తారక్ సూచించడంతో బుచ్చిబాబు ఈ కథను చరణ్ కు చెప్పి మెప్పించారు.

రంగస్థలం మూవీని మించే రీతిలో ఈ కథ ఉంటుందని ఇప్పటికే చరణ్, బుచ్చిబాబు స్పష్టం చేశారు కూడా. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాంచరణ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ కోసం బుచ్చిబాబు భారీ క్యాస్టింగ్ నే రెడీ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్ గా జాహ్నవి కపూర్, మృనాల్ ఠాకూర్ పేర్లను పరిశీలిస్తున్నారట. ఇక మూవీలో రామ్ చరణ్ ను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం ఓ బాలీవుడ్ యంగ్ హీరోను తీసుకోవాలని చూస్తున్నారట బుచ్చిబాబు.

Also Read:నూడుల్స్ తింటున్నారా.. జాగ్రత్త !

బాలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్న టైగర్ ష్రాఫ్ ను విలన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. కథపరంగా చరణ్ కు దీటుగా ఉండే పాత్ర కావడంతో టైగర్ ష్రాఫ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని బుచ్చిబాబు భావిస్తున్నారట. త్వరలోనే టైగర్ ష్రాఫ్ కు కథ కూడా వినిపించేందుకు బుచ్చిబాబు సిద్ధమైనట్లు టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇండియా వైడ్ గా RC16 పై క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

Also Read:జగన్ స్ట్రాటజీ.. చంద్రబాబుకు వర్కౌట్ అవుతుందా?

- Advertisement -