కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు!

39
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతి తార స్థాయిలో కొనసాగుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హస్తం పార్టీ ఉన్నప్పటికి.. బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఏర్పడుతున్న విభేదాలు పార్టీని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ఆ మద్య ప్రకటించిన మొదటి జాబితాలో 55 మందికి స్థానం కల్పించిన కాంగ్రెస్.. ఇక తాజాగా 45 మందితో కూడిన రెండో జాబితాను కూడా విడుదల చేసింది. దీంతో మొత్తం 100 స్థానాలకు కాంగ్రెస్ అబ్యర్థులను ప్రకటించినట్లైంది. అయితే ఎప్పటివరకు ప్రకటించిన సీట్ల విషయంలో చాలమంది నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. టికెట్లు ఆశించిన చాలమంది ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అర్హత కలిగిన వారికి టికెట్లు దక్కలేదని, టికెట్ల కేటాయింపులో పక్షపాతంగా వ్యవహరించారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్ వంటి నియోజిక వర్గాల్లో అసమ్మతి సెగ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ నేత సుజాత, అలాగే ఆసిఫాబాద్ నుంచి సరస్వతి వంటి వారు టికెట్ ఆశించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. ఇక జూబ్లీహిల్స్, ఇబ్రాహిం పట్నం, మునుగోడు వంటి నియోజిక వర్గాల్లో కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి.

జూబ్లీహిల్స్ సీటు మొదట విష్ణువర్ధన్ రెడ్డి ఆశించారు కానీ ఆ సీటును అజహరుద్దీన్ కు కేటాయించడంతో విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట. ఇక ఇబ్రహీపట్నం నుంచి దండెం రాంరెడ్డి, మహేశ్వరంలో నరసింహారెడ్డి, మునుగోడు చలమల కృష్ణారెడ్డి, వంటి వారంతా టికెట్లు ఆశించి భంగపాటుకు గురయ్యారు. దీంతో వీరంతా కూడా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారట. దీంతో టికెట్ల పంచాయతి కాంగ్రెస్ ను తెగ ఇబ్బంది పెడుతోంది. మరి హస్తం హైకమాండ్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

Also Read:కాంగ్రెస్ తడిగుడ్డతో గొంతు కోసింది:సరస్వతి

- Advertisement -