ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది. అర్ధరాత్రి తర్వాత 12:12 గంటలకు చంద్రుడు భూమి ఉపచ్ఛాయలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చందమామ చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది. 1:31 గంటల సమయంలో భూమి ప్రచ్ఛాయలోకి ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభ మవుతుంది. ఉదయం 4:30 గంటలకు ప్రచ్ఛాయ నుంచి బయటకు రావడంతో గ్రహణం పూర్తవుతుంది.
దాదాపు మూడు గంటల పాటు ఉండే చంద్రగ్రహణాన్ని దేశ ప్రజలందరూ వీక్షించవచ్చు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా గ్రహణం ఆద్యంతం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణమని పేర్కొన్నారు.
మరోవైపు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలన్నింటిని మూసివేయనున్నారు. ఇక కళియుగవైకుంఠం టీటీడీని సైతం మూసివేయనున్నారు అధికారులు.ఈ నెల 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనుండడం, రాత్రి చంద్రగ్రహణం కారణంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.