KCR:పువ్వాడా పువ్వు కావాలా?..తుమ్ముల ముల్లు కావాలా?

50
- Advertisement -

ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం…కాంగ్రెస్ నేత తుమ్మలపై విమర్శలు గుప్పించారు. ఖమ్మం ప్రజలు తుమ్మల ముల్లు కావాలా..? పువ్వాడ అజయ్ పువ్వు కావాలా ఆలోచించాలన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తిని మంత్రి చేసి జిల్లాను అప్పజెప్పితే ఒక పువ్వాడ అజయ్ తప్ప ఎవరూ గెలవలేదని మండిపడ్డారు.

పువ్వాడ అజయ్ విజన్‌తో ఖమ్మం అభివృద్ది చెందిందన్నారు. ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత పువ్వాడకే దుక్కుతుందన్నారు. ఖమ్మం అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. ఓటును దుర్వినియోగం చేయవద్దని, అభివృద్ధికి వినియోగించుకోవాలని ఖమ్మం ఓటర్లకు సూచించారు.

పువ్వాడ మంచి కార్యకర్త అని, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు తప్పక గెలిపించాలని…అభివృద్ధికి ఓటు వేయాలన్నారు. ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు అందుకే అభివృద్ధిని ఆపుకోవద్దన్నారు. జిల్లాకు చెందిన ఓ నేత బీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యేను గెలవనీయమని మాట్లాడుతున్నారని జిల్లా ప్రజలను గుత్తపట్టారా అంటూ దుయ్యబట్టారు. ఖమ్మం ఉజ్వల భవిష్యత్ కోసం బీఆర్ఎస్‌కు మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

Also Read:ఎన్టీఆర్ కొత్త మూవీపై క్రేజీ అప్ డేట్

- Advertisement -