ఏకాగ్రతను పెంచే ‘తులాసనం’!

76
- Advertisement -

నేటిరోజుల్లో పని ఒత్తిడి కారణంగా చాలమందిలో ఏకాగ్రత లోపిస్తోంది. తద్వారా చేసే పనిలో చురుదనం కోల్పోతు ఉంటారు. ఎక్కువగా అలసటకు లోనవుతూ ఉంటారు. చేయాల్సిన పనిపై కూడా ధ్యాస ఉండదు. వీటన్నికి కారణం మానసిక ఒత్తిడే. అయితే యోగాలో మానసిక ఒత్తిడిని తగ్గించే ఆసనాలు చాలానే ఉన్నాయి. కానీ అధునాతనమైన తులాసనం మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచడంలో సమర్థవంతంగా పని చేస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనంలో శ్వాసపై దృష్టి కేంద్రీకరించి చేయడం వల్ల ఏకాగ్రతతో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆసనం వేయడం మొదటిదశlo కొంత కష్టతరమైనప్పటికి.. సాధన చేయడం ద్వారా ఈ ఆసనం సులభతరం అవుతుంది. మానిసిక ఒత్తిడితో భాడపడే వాళ్ళు తులాసనం ప్రతిరోజూ తప్పనిసరిగా వేస్తే రోజంతా యాక్టివ్ గా ఉంటారని యోగా నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఘనంగా “ఇట్లు… మీ సినిమా” ట్రైలర్ లాంచ్‌

తులాసనం వేయు విధానం
మొదట తలకిందులుగా చేతులపై మరియు తలపై శరీర బరువు బ్యాలెన్స్ చేస్తూ కాళ్ళను పైకి లేపాలి. ఇలా మొదటి సారి చేసేటప్పుడు ఎవరైనా సహాయం తీసుకోవడం ఉత్తమం. ఆ తరువాత ఏదైనా గోడను ఆధారం చేసుకొని ఆ గోడకు సమాంతరంగా కాళ్ళను లంబకోణంలో పోటోలో చూపిన విధంగా ఆనించాలి. ఇలా కాళ్ళను గోడకు ఆనించినప్పుడు శరీర బరువు రెండు చేతులపై ఉండేలా చూసుకోవాలి. ఇలా ఈ తులాసనంలో ఉన్నప్పుడూ చూడడానికి చతురస్రాకారం వలె కనిపిస్తుంది. ఈ భంగిమలో ఉన్నప్పుడూ శ్వాసక్రియ నెమ్మదిగా జరిగించాలి. మూడు నుంచి ఐదు నిముషాల పాటు తులాసనం వేసిన తరువాత సాధారణస్థితి రావాలి.

గమనిక
ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు యోగా నిపుణుల పర్యవేక్షణలో ఈ ఆసనం సాధన చేయడం ఉత్తమం.

- Advertisement -