ఉలగనాయకన్ కమల్ హాసన్ ఇండియన్ సినిమా లివింగ్ లెజెండ్. 6 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో కల్ట్ క్లాసిక్ విజయాలతో, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్తగా అద్భుతమైన సినిమాలని అందించాలనే తపనతో పని చేస్తున్నారు. చాలా మంది దర్శకులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా కమల్ హాసన్ తో కలిసి పనిచేయాలని కోరుకుంటారు, ఎందుకంటే సినిమాలని చేయడంలో కమల్ హాసన్ ఓ యూనివర్సిటీ.
తన అద్భుతమైన విజన్, రైటింగ్, డైరెక్షన్ తో అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం. కమల్ హాసన్, మణిరత్నం 37 సంవత్సరాల క్రితం నాయకన్/నాయకుడు లాంటి ఆల్-టైమ్ క్లాసిక్‌ని అందించారు. ఈ ఆల్-టైమ్ క్లాసిక్ ఇండియన్ ఫిల్మ్ తరతరాలుగా ప్రేక్షకులలో కల్ట్ ఫాలోయింగ్ వుంది. టైమ్ మ్యాగజైన్ ప్రపంచ సినిమాల్లోని 100 ఆల్-టైమ్ క్లాసిక్స్ జాబితాలో వున్న ఏకైక భారతీయ చిత్రం ఇది.
ఇలాంటి సెన్సేషనల్ కాంబినేషన్ లో వారి అప్ కమింగ్ మూవీ ‘థగ్ లైఫ్’ను ప్రకటించినప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలా మంది అభిమానులు, సినీ ప్రేమికులు ఈ కాంబినేషన్ కోసం వేచి ఉన్నారు. చివరకు వారు 37 సంవత్సరాల తర్వాత ఒక ఎపిక్ యాక్షన్ డ్రామాను అందించడానికి రెడీ అయ్యారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా సాలిడ్ మల్టీస్టారర్ గా కూడా వస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒకో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు. ఇలా జూన్ రిలీజ్ కి ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ ని షురూ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఫస్ట్ సింగిల్ లాంఛ్ కి కూడా తమిళ నాట ఒక ఈవెంట్ పెట్టి అందులోని ప్రెస్ మీట్ కూడా పెట్టి లాంచ్ చేస్తుండడం అనేది అర్థం చేసుకోవచ్చు.
Also Read:మోడీ చిత్తశుద్దిని నిరూపించుకోండి: కేటీఆర్

