‘తృప్తి డిమ్రి’ బాలీవుడ్ భామ. “యానిమల్” సినిమాలో ఆమె నటించి దేశమంతా పాపులర్ అయింది. బాలీవుడ్ లో ఇప్పుడు అందరూ తృప్తి గురించే మాట్లాడుతున్నారు. కానీ, ఆమె ఫోకస్ మాత్రం టాలీవుడ్ పైనే ఉంది. తనకు వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవాలంటే.. సౌతే బెటర్ అని తృప్తి డిమ్రి ఫీల్ అవుతుంది. అందుకే, ఆమె బాలీవుడ్ లో కొత్త సినిమాల కోసం పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. కానీ, సౌత్ లో మాత్రం ఇద్దరు మేనేజర్స్ ను పెట్టుకుని మరీ పెద్ద హీరోల సినిమాల కోసం ఎదురు చూపులు చూస్తోంది. పనిలో పనిగా ఎన్టీఆర్ పై తనకు ఉన్న అభిమానాన్ని కూడా బాహాటంగానే చెప్పింది.
ఇంతకీ, తృప్తి డిమ్రి ఏం మాట్లాడింది అంటే.. ‘నాకు సౌత్ లో మాత్రం ఎన్టీఆర్ తో నటించాలని ఉంది. “ఆర్ఆర్ఆర్” చూశాక ఎన్టీఆర్ ఇంటెన్స్ యాక్టింగ్ నచ్చింది. అంత గొప్పగా నటిస్తున్నాడు ఎలా ? అని నేను చాలాసార్లు ఆలోచించాను. ఎప్పటికైనా ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తోంది అని ఆశిస్తున్నా’ అంటూ తృప్తి డిమ్రి చెప్పుకొచ్చింది. ఆమె కెరీర్ లో ఒక పెద్ద హీరో సరసన నటించిన మొదటి చిత్రం యానిమల్. అది కూడా సైడ్ క్యారెక్టర్ లో తృప్తి డిమ్రి కనిపించింది. అలాంటి భామకు ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ వస్తోందా ?, ఆమెకు ఉన్న టాలెంట్ అండ్ గ్లామర్ ను బట్టి.. త్వరలో తృప్తి డిమ్రి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం అంటున్నారు.
పైగా తృప్తి డిమ్రి ప్రస్తుతం ముంబై, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతోంది. పెద్ద హీరోల సినిమాకి ఎప్పుడు డేట్స్ కావాలి అని అడిగితే, అప్పుడే ఇచ్చేస్తా అంటూ ఆఫర్లు కూడా ఇస్తోంది. తెలుగులో బిజీ అయ్యేవరకు బాలీవుడ్ లో బిజీగా ఉండాల్సిన ప్రాజెక్ట్స్ కి కూడా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఏ తెలుగు సినిమాని తీసుకున్నా.. అది లోకం ఫిల్మ్ అయినప్పటికీ.. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతుంది. పైగా బాలీవుడ్ సినిమాల కన్నా భారీగా విడుదల అవుతుంది. అందుకే, తృప్తి డిమ్రి సౌత్ సినిమాల పై ఫోకస్ పెట్టింది. మరి ఆమె ఫోకస్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read:CM Revanth:త్వరలో జర్నలిస్టు నాయకులతో భేటీ