పెళ్లికి ముగ్గురు హీరోలు సన్నాహాలు

46
- Advertisement -

పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి హడావుడే జరుగుతుంది. టాలీవుడ్ లో హీరోల పెళ్లిళ్ల పై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఏకంగా ముగ్గురు హీరోలు పెళ్లికి రెడీ అయ్యారని, వారి పెళ్లిళ్లకు తగిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయని టాక్ నడుస్తోంది. ఇంతకీ, ఎవరు ఆ హీరోలు ?, ఏమిటి వారి పెళ్లిళ్ల గోల ? చూద్దాం రండి. టాలీవుడ్ లో ఉన్నమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. లేటెస్ట్ న్యూస్ ప్రకారం వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని సమాచారం.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోనున్నట్టు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. తాజాగా వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపినట్టు సమాచారం. కాకపోతే పెళ్లి ముహూర్తాన్ని వారు ఇంకా నిశ్చయం చేయలేదని తెలిసింది. అలాగే రెండో హీరో విషయానికి వస్తే.. ప్రముఖ హీరో శర్వానంద్‌, రక్షితా రెడ్డిల వివాహ తేదీ ఖరారయింది. జూన్‌ 2, 3 తేదీల్లో గ్రాండ్‌గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ వెడ్డింగ్‌కు స్నేహితులు, ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులకు ఆహ్వానం అందనున్నట్లు సమాచారం. వీరి నిశ్చితార్థం ఈ ఏడాది ప్రారంభంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

Also Read: సమంతతో డీజే టిల్లు…!

ఇక ముచ్చటగా మూడో హీరో విషయానికి వస్తే.. మాజీ లవర్ బాయ్ తరుణ్ కూడా పెళ్లికి సన్నద్ధం అయ్యాడు. రోజా రమణి ఓ ఇంటర్వ్యూలో హీరో తరుణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అందరి ఆశీస్సులతో తరుణ్ మళ్లీ రాణిస్తాడు అని, ప్రస్తుతం అభిమానుల ఆశీస్సులతో హ్యాపీగా ఉన్నాం అని, తరుణ్ పెళ్లి ఒక్కటి అయితే చాలు. అంతకుమించి ఏం లేదు. అది ఎలాగో అవుతుంది” అని ఆమె అన్నారు. రోజా రమణి కామెంట్స్ ను బట్టి, ఈ ఏడాది తరుణ్ పెళ్లి కూడా అయ్యేలా ఉంది.

Also Read: బెస్ట్ క్లైమాక్స్‌ మూవీ :నందినీ రెడ్డి

- Advertisement -