మల్కాజిగిరి బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు కాల్స్..

52
- Advertisement -

బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మల్కాజిగిరి బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నెంబర్ తో కాల్స్ వస్తుండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బాధితులు.టెక్నాలజీ ఉపయోంచి ఎమ్మెల్యే పేరుతో కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు మల్కాజిగిరి, నేరెడ్మెట్, అల్వాల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు నేతలు.

బెదిరింపు కాల్స్ అందుకున్న వారిలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, నేరెడ్మెట్ కార్పొరేటర్ భర్త ఉపేందర్ రెడ్డి, గౌతమ్ నగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్, మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఇతర ముఖ్య బి.ఆర్.ఎస్ నేతలు ఉన్నట్లు వారందరూ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మైనంపల్లి ఓటమి చెందడంతో ఆయన అనుచరులే ఈ బెదిరింపు కాల్స్ చేసి తమ అంతు చూస్తామని బెదిరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి, నేరెడ్మెట్ పోలీస్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -