కర్ణాటక మాజీ సీఎంలకు బెదిరింపు లేఖ!

79
karnataka
- Advertisement -

కర్ణాటక మాజీ సీఎంలు సిద్దరామయ్య,కుమారస్వామితో సహా 60 మందిని చంపేస్తామని ఓ ఆగంతకుడు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పలువురు రచయితలు కూడా ఉన్నారు.

మీరు ముస్లింల పక్షాన ఉంటూ.. హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్న ఆగంతకుడు వీరంతా దేశద్రోహులను పేర్కొన్నాడు. అంతా హిందుమత ద్రోహులు. ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు.. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

వారిలో సీనియర్ కన్నడ రచయిత కుమ్‌ వీరభద్రప్ప (కుంవీ) కూడా ఉన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు రచయిత కుంవీ. తప్పుడు వాదనలు చేస్తూ కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతను పెంచడానికి హోంమంత్రి స్వయంగా ప్రయత్నిస్తున్నప్పుడు, ఫిర్యాదు చేయడానికి పోలీసులపై నాకు ఎలాంటి విశ్వసనీయత లేదని తెలిపారు కుంవీ.

- Advertisement -