ఓటీటీలోకి వెళ్ళడానికి మరో మూడు క్రేజీ చిత్రాలు రెడీ అయ్యాయి. గుణ శేఖర్ డైరెక్షన్‌లో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం’. ఇటీవలే థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నెల 12న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫ్లామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక రెండో సినిమా విషయానికి వస్తే.. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్ వేద’. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. తమిళ ‘విక్రమ్ వేద’కి రీమేక్‌గా తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రం ‘జియో సినిమా’లో ఈ మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గతేడాది సెప్టెంబరు 30న విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫ్లామ్‌పైకి రాబోతోంది.
Also Read: కమల్‌హాసన్ చేతులమీదుగా ఎస్కే21 లాంఛ్
మూడో సినిమా విషయానికి వస్తే.. గోపీచంద్ హీరోగా డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వచ్చిన చిత్రం ‘రామబాణం’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శుక్రవారం విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే తాజాగా ‘రామబాణం’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ మూవీని సోనీ లివ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. జూన్ మొదటి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Also Read: సమంతతో డీవోర్స్ కి కారణం అదే