ఫిబ్రవరి 10న వరుణ్‌..తొలి ప్రేమ

238
- Advertisement -

మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలొచ్చినా.. తొలిసారి ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం అంటూ వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కావాల్సిఉండగా.. ఫిబ్రవరి 10కి వాయిదా పడింది.

కాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారు.ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, ప్రియదర్శిని, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటిస్తున్నారు.1998లో విడుద‌లైన వవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ అప్పట్లో ఘనవిజయం సాధించగా… ఇప్పుడు అదే టైటిల్‌‌తో వరుణ్‌ తేజ్ వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇటీవల విడుదలైన ‘తొలిప్రేమ’ టీజర్‌లో ‘ఏ జర్నీ ఆఫ్ లవ్’ అంటూ క్లాసీ లుక్‌తో వరుణ్ తేజ్ ఆకట్టుకున్నాడు. వెంకటేశ్వర సినీ చిత్ర, ఎల్‌ఎల్‌పి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘తొలిప్రేమ’ చిత్రానికి తమన్ స్వరాలను సమకూర్చుతున్నారు.

tholi prema

- Advertisement -