తొలిప్రేమ…యు\ఎ

185
Tholi Prema Censored UA

వ‌రుణ్ తేజ్, వెంకీ అట్లూరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం తొలి ప్రేమ‌. అంద‌మైన ప్రేమ క‌థా చిత్రంగా తెర‌కెక్కిన ఈ మూవీ ఫిబ్రవ‌రి 10న రిలీజ్‌కి రెడీ అయింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు\ఎ సర్టిఫికెట్‌ని పొందింది.

వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ ఫిబ్రవరి 3న భీమవరంలో జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లన్ని పూర్తికాగా 25 వేల మంది ప్రేక్షకులు ఈ వేడుకను చూసే విధంగా ఏర్పాట్లుచేశారు. చిత్రయూనిట్‌తో పాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

Tholi Prema Censored UA

ఇవాళ విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందనవస్తోంది. వరుణ్ తేజ్ .. రాశి ఖన్నా ఇద్దరూ కూడా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. డైలాగ్స్ పరంగా .. సంగీతం పరంగా .. ఫోటోగ్రఫీ పరంగా ఈ ట్రైలర్ కి మంచి మార్కులు పడిపోయాయి. ఈ ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై అంచనాలను పెంచడంలో, ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. తమన్ చిత్రానికి సంగీతం అందించగా… శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు.

Tholi Prema Theatrical Trailer | Varun Tej | Raashi Khanna | Thaman S | Venky Atluri | #TholiPrema