ఈ ఆసనాలు వేస్తే..మతిమరుపు దూరం!

67
- Advertisement -

యోగాసనాలు అనేవి ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి నివారణ మార్గంగా ఉన్నాయి. ఎందుకంటే యోగా వల్ల శరీరభాగాలలో నిర్ధిష్ట కదలికలు ఏర్పడతాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చు. కాగా నేటి రోజుల్లో చాలమంది అల్జీమర్ వ్యాధి ( మతిమరుపు ) తో భాద పడుతూ ఉంటారు. ముఖ్యంగా వయసు పై బడిన వారిలో ఈ మతిమరుపు సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాగా ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఫలితం మాత్రం కనిపించదు. అయితే యోగాలో మతిమరుపును దూరం చేసి జ్ఞాపకశక్తిని పెంచే కొన్ని రకాల ఆసనాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.

1) సిద్దాసనం
ఈ ఆసనాన్ని ఋషులు వేయు ఆసనంగా పరిగణిస్తారు. ఈ ఆసనం వేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి దూరం చేయడంలో ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఆసనం ప్రతిరోజూ సాధన చేయడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుందట. తద్వారా మతిమరుపు దురమౌతుంది.
వేయు విధానం : సమతల నేలపై లేదా యోగా షీట్ పై రెండు కాళ్ళు మడుచుకొని కూర్చోవాలి. ఆ తరువాత కుడికాలు, ఎడమ కాలు తొడపై అలాగే ఎడమ కాలు పాదం కుడికాలు తొడపై అభిముఖంగా ఉంచాలి. ఆ తరువాత వెన్నెముకను నిటారుగా చేసి రెండు చేతులను రెండు మోకాళ్ళపై ఉంచి ద్యాన విధానంలో కూర్చోవాలి. ఆ తరువాత కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పిల్చుకొని నెమ్మదిగా వదలాలి. ఇక కనీసం 5-10 నిముషాల పాటు సాధన చేయాలి.

2) కామదహనాసనం
ఈ ఆసనంలో ముందుగా వజ్రాసనంలో కూర్చొని ఆ తర్వాత రెండు కాళ్ళ పాదములను నేలకు ఆనించి వేళ్ళపై ఉండవలెను. రెండంచులు కలిగిన దండముపై చేతులు ఉంచి దాని యొక్క ఆసరాతో శరీరాన్ని కొద్దిగా ముందుకు వంచి వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఆ తరువాత ఉచ్శ్వాస నిచ్శ్వాసలు చేస్తూ ఆసనాన్ని నిర్ధిష్ట సమయం వరకు కొనసాగించవలెను
ఈ ఆసనం వేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగడంతో పాటు వెన్ను సమస్యలు కూడా దురమౌతాయి.

Also Read:ట్రెండింగ్‌లో రాజా సాబ్..మోషన్ పోస్టర్

3) స్వస్తికాసనం
ఈ ఆసనంలో భాగంగా తొడలపై పిక్కలపై పదములను ఉంచి నిటారుగా కూర్చోవలెను. ముక్కుకొనపై దృష్టి కేంద్రీకరించి ఎలాంటి కదలిక లేకుండా ద్యానం చేయాలి. ఇలా చేయడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి లభిస్తుంది.

ఇంకా వజ్రాసనం, శవాసనం వంటివి కూడా మతిమరుపును దూరం చేసి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

- Advertisement -