ఈ వారం ఓటీటీ సినిమాలివే!

125
ott
- Advertisement -

ఈ వారం ఓటీటీ థియేటర్లో తెలుగు సినిమాల సందడి కనిపించబోతోంది. యాంకర్ సుమ ప్రధానపాత్రలో జయమ్మ పంచాయితీ జూన్ 14 నుంచి అమెజాన్‌లోకి అందుబాటులో ఉంది. శ్రీరామ్, శివ బాలాజీ ఇలా ముఖ్య పాత్రల్లో రాబోతోన్న రెక్కీ చిత్రం జూన్ 17 నుంచి జీ5లో ప్రసారం కానుంది.

నయనతార ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఓ2(o2) (ఆక్సిజన్) చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో జూన్ 17 నుంచి రానుంది. ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సుజల్ అనే చిత్రం కూడా ఓటీటీలోనే రానుంది. జూన్ 17 నుంచి అమెజాన్‌లోకి రానుంది. రెజీనా మెయిన్ లీడ్‌లో నటించిన ఫింగర్ టిప్ సీజన్ 2 జూన్ 17 నుంచి జీ5 యాప్‌లో ప్రసారం కానుంది.

ఇక థియేటర్లలో విరాటపర్వం జూన్ 17న విడుదల కానుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరంగల్లులో 1992వ ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల నేపథ్యంలో తెరకెక్కింది.

- Advertisement -