- Advertisement -
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది. గ్రూపుల్లో వరుసగా మెసేజ్‌లు వస్తున్నట్లుగా ఫీచర్లు వరుస కడుతున్నాయి. ఇప్పుడు వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. మీరు గ్రూప్ ను వీడినా ఇకపై ఎవరికీ తెలియదు. ఓ గ్రూప్ నుంచి మీరు నిష్క్రమించడం మొత్తం సైలెంట్‌గా జరిగిపోతుంది. కేవలం గ్రూప్ అడ్మిన్‌కు మాత్రమే మీరు నిష్క్రమించినట్టు తెలుస్తుంది.
యూజర్ల గోప్యతకు పెద్దపీట వేస్తూ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. వాట్సాప్ డెస్క్ టాప్ బీటా వెర్షన్లలో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. త్వరలోనే వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వెర్షన్ల రూపంలోనూ ఈ ఫీచర్‌పై పరిశీలన చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
- Advertisement -