మెరిసే దంతాల కోసం

69
- Advertisement -

దంతాలు ఆకర్షణీయంగా మెరుస్తూ ఉండాలని ఎవరు మాత్రం కోరుకొరూ.. ఎందుకంటే ఎదుటివారిని ఆకర్షించాలంటే మనం చిరు నవ్వు నవ్వినప్పుడు.. కనిపించే దంతాలు చక్కగా తెల్లగా ఉంటేనే శుబ్రంగా ఉంటేనే నలుగురిలో కాన్ఫిడెంట్ గా మాట్లాడగలం.. అలా కాకుండా దంతాలు అపరిశుభ్రంగా, పచ్చగా పాచితో ఉంటే ఎవరు మనతో మాట్లాడడానికి ఇష్టపడరు. అందుకే ఎదుటివారిని ఆకర్షించడంలో దంతాలు చాలా ముఖ్యమైనవి. దంతాలపై గార, పాచి ఉన్నవాళ్ళు రకరకాల పేస్ట్ వాడుతూ ఉంటారు. అయినప్పటికి పెద్దగా మార్పేమి కనిపించదు. అందువల్ల కొన్ని సూచనలు పాటిస్తే ఆరోగ్యకరమైన మెరిసే దంతాలను సొంతం చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా !

ముఖ్యంగా దంతాలు తెల్లగా మారాలంటే మనం బ్రేస్ చేసే విధానం చాలా ముఖ్యం. సరైన టూత్ పేస్ట్ ను ఎంచుకొని రోజుకు రెండు సార్లు బ్రేష్ చేయాలి. ఎందుకంటే ఉదయం బ్రేస్ చేసిన తరువాత బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాము. అందువల్ల దంతాలపై మరకలు అలాగే పేరుకొని పోయి సూక్ష్మజీవులు పెరగడానికి కారణం అవుతాయి. అందువల్ల ఆఫ్టర్ డిన్నర్ తరువాత నైట్ పడుకునే ముందు కూడా దంతాలను శుభ్రం చేయడం వల్ల వాటిపై ఎలాంటి మరకలు, మలినలు చెరకుండా తెల్లగా మెరుస్తాయి. ఇక రెగ్యులర్ గా వాడే టూత్ బ్రేష్ ను ఎన్ని రోజులు గడిచిన అలాగే వాడుతూ ఉంటారు కొందరు. ఇలా వాడడం వల్ల దంతాలపై ఉండే ఏనామిల్ పాడైపోయి మరకలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. .

కాబట్టి కనీసం రెండు నెలలకు ఒకసారి టూత్ బ్రెష్ తప్పకుండా మార్చాలి. ఇంకా మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా దంతాలను మెరిసేలా చేయడంలో ఉపయోగ పడతాయి. ముఖ్యంగా సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే నిమ్మ, ఆరెంజ్, జామ వంటి పండ్లను తినాలి. ఇవి దంతాల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఉపయోగ పడతాయి. ఇంకా యాపిల్ మరియు పియర్స్ వంటివి కూడా దంతాలకు ఉపయోగకరమైనవే. ఇంకా కాల్షియం అధికంగా ఉండే పెరుగు పాలు, జున్ను వంటివి కూడా బాగా తినాలి, వీటి వల్ల దంతాలు బలంగా మారడంతో పాటు ఆకర్షణీయంగా తయారవుతాయి. అలాగే మద్యం, సిగరెట్ త్రాగడం, పాన్, గుట్కా తినడం వంటి అలవాట్లు ఉన్నవారు వాటిని తప్పక మనుకోవాలి. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బ తియ్యడమే కాకుండా దంతాలపై గార ఏర్పడడానికి ప్రధాన కారణం అవుతాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు సూచనలు పాటించి దంతాలను ఆకర్షణీయంగా అందంగా మెరిసేలా చేసుకోవచ్చు.

Also Read: టిల్లు స్క్వేర్… బర్త్‌డే గ్లింప్స్

- Advertisement -