చరిత్ర చెరిగిపోనిది…అది పునరావృతమవుతూనే ఉంటుంది. కాలచక్రంలో ఎన్ని వింతలు ..మరెన్ని విశేషాలో! వచ్చే అక్టోబర్ నెల కూడా అలాంటి ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది .అవేంటో మీరే చూడండి..
రానున్న అక్టోబర్.. చాలా అరుదైన నెల. 8 శతాబ్దాల తర్వాత వస్తోంది. కాకతీయ రాజుల కాలం నాటి నెల ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఒకే నెలలో మూడు పండుగలు.. పౌర్ణమి, అమావాస్యలు కలిసి వచ్చిన అత్యంత అరుదైన నెలగా చెబుతున్నారు పండితులు. సరిగ్గా 863 ఏళ్ల క్రితం అంటే 1153వ సంవత్సరంలో ఇలాంటి నెల వచ్చింది.
ఇంతకీ రాబోయే అక్టోబర్ నెలకు ఉన్న స్పెషలాటీ ఏంటో తెలుసా..! మూడు పండుగలు.. పౌర్ణమి, అమావాస్యలు ఒకే నెలలో వస్తుండడం. అంతేకాదు.. ఒకే నెలలో ఐదు ఆదివారాలు, సోమవారాలు, శనివారాలు వస్తుండడం మరో విశేషం. ఇకపోతే బతుకమ్మ, దసరా, పీర్ల పండుగ, దీపావళి.. ఇలా పండుగలన్ని కూడా ఒకేసారి వచ్చినట్టుంది ఈ నెలలో.
పండుగలతో పాటు రెండో శనివారం కూడా కలిసి వస్తుండడంతో దాదాపు 15రోజుల పాటు విద్యార్థులకు, ఐటీ ఉద్యోగులకు సెలవులు దొరకనున్నాయి.
రానున్న అక్టోబర్ ప్రత్యేకతలు:
ఆదివారాలు: 2, 9, 16, 23, 30
సోమవారాలు: 3, 10, 17, 24, 31
శనివారాలు: 1, 8, 15, 22, 29
పండగలు: బతుకమ్మ సంబురాలు, దసరా(11), పీర్ల పండుగ(12), దీపావళి(30)
పౌర్ణమి(16) అమావాస్య (30)
ఆరోజు బ్యాంకులు పనిచేస్తాయి…
ఈ ఆధునిక యుగంలో ఉదయం లేచింది మొదలు బ్యాంకులు, ఏటీఎంలతోనే పని. వ్యాపారులకు అయితే నిత్యం లావాదేవీలుంటాయి. ఒక్కరోజు బ్యాంకు లేకపోతే పని గడవదు… అలాంటిది ఈ దసరాలో వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. సినీ డైలాగ్ మాదిరి ద్యావుడా అంటూ వ్యాపారులు వణికిపోతున్నారు. కానీ, బ్యాంకుల పని దినాలపై ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ స్పష్టత ఇచ్చింది.
వచ్చే నెలలో వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో 2016 అక్టోబర్ 10న బ్యాంకులు పని చేయనున్నట్టు అసోసియేషన్ తెలిపింది. అక్టోంబర్ 8న రెండో శనివారం, 9న ఆదివారం, 10న ఆయుధ పూజ, 11న విజయదశమి, 12న మొహర్రం పండుగల కావడంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.
అయితే వరుసగా మూడు రోజుల మినహా ఎక్కువ రోజులు బ్యాంకులు సెలవులు పాటించకూడదనే నిబంధనతో ఆ రోజుల్లో ఒకరోజు పనిదినాన్ని పాటించాలని బ్యాంకులు నిర్ణయించాయి. అక్టోబర్ 10 ఆయుధ పూజ రోజున బ్యాంకులు పనిచేయనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించింది.