ఈ ఆకు గురించి తెలిస్తే.. తినకుండా ఉండలేరు!

73
- Advertisement -

ఆకుకూరలు మన శరీరానికి ఎంతమేలు చేకూరుస్తాయో మనందరికి తెలిసిందే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న ఆకుకూరలే ఎక్కువగా తినమని చెబుతుంటారు. ఈ ఆకుకూరాలలో చాలారకాలే ఉన్నాయి. అయితే సెలెరి అనే ఆకుకూరలో ఇంకా మెరుగైన ఆరోగ్య ప్రయోజనలు ఎన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎపియం జాతికి చెందిన ఈ మొక్క సుమారు ఒక మీటర్ వరకు పెరుగుతుంది. దీని యొక్క కాండము, ఆకులు, వేరుభాగం ఇలా అన్నిటినికి కూడా ఆహారంగా తింటారు. సెలెరిలో ఉండే ఎన్నో పోషకాలు ఎండోక్రైన్ గ్రంధుల పనితీరును మెరుగుపరుస్తాయి.

తద్వారా మగవారు ఎక్కువగా ఎదుర్కొనే శృంగార సమస్యలు అంగస్తంబన, శీఘ్రస్కలనం ” వంటి సమస్యలు దూరం కావడంతో పాటు వీర్య కణాల వృద్దిని పెంచడంలో సెలెరి ఎంతగానో ఉపయోగపడుతుంది. సెలెరిలో విటమిన్ ఏ, సి, కె, ఇ, వంటివాటితో పాటు ఫోలెట్ యాసిడ్, పిరిడాక్సిన్, వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇక సెలెరిలో ఉండే యాంటీ ఇంఫ్లమెంటరీ లక్షణాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్.. శరీరంలోని క్యాన్సర్ కరకాలను నివారిస్తుంది. అంతే కాకుండా ఆర్థరైటిస్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.

సెలెరిలో 95 శాతం నీరు మరియు ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఇది మన శరీరంలో సెల్యులార్ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా రక్తనాళలలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక సెలెరిని ప్రతిరోజూ తినడం వల్ల రక్తపోటు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇక సెలెరిలో ఉండే యాంటీ ఇంఫ్లమెంటరీ మెంటరీ గుణాలు యూరినరీ ట్రాస్ట్ సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా సెలెరి గింజల వివిధ రకాల ఔషధాలలో కూడా వినియోగిస్తారు. ఇది మూత్రపిండ సమస్యలను, అలాగే సిస్టీటీస్ సమస్యలను దూరం చేస్తుంది,. మహిళల్లో వచ్చే మూత్రశాయ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. అందువల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్న సెలెరిని తినడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:Siddu:’టిల్లు స్క్వేర్’ నవ్వులు పూయిస్తుంది

- Advertisement -