‘ముఫాసా: ది లయన్ కింగ్’ కోసం షారుఖ్

10
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఫ్రాంచైజ్ లోని కొత్త సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది డిస్నీ. ఈ చిత్రం కోసం మొట్టమొదటి సారిగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన ఇద్దరు తనయుల తో కలిసి వాయిస్ యాక్టింగ్ (డబ్బింగ్) చేయనున్నారు.

ఈ చిత్రం లోని ప్రధాన పాత్ర ముఫాసా కి షారుఖ్ గొంతు అరువిస్తుండగా, ఆర్యన్ ఖాన్ సింబా పాత్ర కి డబ్బింగ్ చెప్తున్నారు. చిన్నప్పటి ముఫాసా పాత్ర కి షారుఖ్ చిన్న కుమారుడు అబ్రమ్ ఖాన్ డబ్బింగ్ చెప్తున్నారు.

షారుఖ్ తో పాటి అతని కుమారులు ఇప్పటికే డబ్బింగ్ చెప్పిన హిందీ ట్రైలర్ విడుదలై సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది. డిసెంబర్ 20 న ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ తో పాటు, తెలుగు తమిళ్ భాషల్లో కూడా విడుదల కానుంది.

Also Read:NBK 109..కీ అప్‌డేట్

- Advertisement -