త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అదే !

81
- Advertisement -

దర్శకుడు త్రివిక్రమ్ హారిక హాసినికే పరిమితం అయిపోయేలా ఉన్నాడు. వరుసగా ఈ బ్యానర్ కే సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్.. మహేష్ బాబు సినిమాను కూడా ఈ బ్యానర్ కే చేయబోతున్నాడు. దాని తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారు త్రివిక్రమ్. బన్నీతో చేయబోయే సినిమాని
హారిక హాసినికే చేస్తున్నాడు.

దాంతో పాటే హారిక హాసిని దగ్గర బాలయ్య డేట్లు ఉన్నాయి. కాబట్టి… మధ్యలో గ్యాప్ దొరికితే.. త్రివిక్రమ్ బాలయ్యతో కూడా సినిమా చెయ్యొచ్చు. అలాగే హారిక హాసిని దగ్గరే డేట్ లు వున్న ఎన్టీఆర్ తో కూడా త్రివిక్రమ్ మళ్ళీ సినిమా చేస్తారని టాక్ ఉంది. అంటే ఈ లెక్కన మరో ఏడేళ్లు వరకు త్రివిక్రమ్ హారిక హాసిని నుంచి బయటకు వచ్చేదే లేదు.

మొత్తానికి హారిక హాసినికే త్రివిక్రమ్ తన లైఫ్ టైమ్ డైరెక్షన్ ను కట్టుబడి ఉన్నట్టు ఉన్నాడు. ఇక మహేష్ సినిమా తరువాత బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప తర్వాత బన్నీ రేంజ్ బాగా పెరిగింది. పుష్ప 2 తో ఇంకా పెరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ త్రివిక్రమ్ తో బన్నీ సినిమా అంటే కచ్చితంగా ఆసక్తిగా వుంటుంది.

అందుకే ఈ సినిమాని పాన్ వరల్డ్ సినిమాగా తీసుకొస్తారట. హారిక హాసిని – త్రివిక్రమ్ – బన్నీ బంధం గట్టిగా అల్లుకుంది కాబట్టే, నిర్మాతలు కూడా రిస్క్ కు, ఖర్చుకు వెనుకాడరు. సో.. త్రివిక్రమ్ నుంచి లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -