ఎన్నికలకు టీడీపీ దూరం.. కారణమదే?

33
- Advertisement -

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటలని టీడీపీ కలలు కంటూ వచ్చింది. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరం కానుందా ? అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటివరకు తెలంగాణ ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ పోటీ చేస్తుమని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. రాష్ట్రంలో అన్నీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవల స్పష్టం చేశారు కూడా. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కాసాని భేటీ అనంతరం టీడీపీ పోటీ పై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం అధినేత జైల్లో ఉండడంతో టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. .

ఇప్పటికే ఏపీలో పార్టీ కార్యకలపాలన్నీ కూడా హోల్డ్ లో పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణపై దృష్టి సారించే పరిస్థితులు లేవు. దానికి తోడు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోతే ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై కూడా పడుతుందనే భయం టీడీపీ అధినేతలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబును కోరినప్పటికి ఆయన నిరాకరించినట్లుగా తెలుస్తోంది.

నామమాత్రంగా పోటీ చేసే బదులు పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉండడమే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారట అధినేత చంద్రబాబు, ఇదిలా ఉంచితే టీడీపీ మిత్రపక్షం అయిన జనసేన పార్టీ ఆల్రెడీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతే కాకుండా బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి మిత్రపక్ష పార్టీలు యాక్టివ్ గా ఎన్నికల బరిలో దిగుతుంటే టీడీపీ దూరంగా ఉండడం మంచిది కాదేమో అనే ఆలోచన కూడా తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో ఉందట. మరి ఎన్నికల్లో పోటీ పై బాబు తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:Bigg Boss 7 Telugu:ఒక్కొక్కరికి క్లాస్ పీకిన నాగ్

- Advertisement -