నిహారిక విడాకులకు కారణం అదే

98
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక డివొర్స్‌ పై వస్తున్న వార్తలు నిజమయ్యాయి. హైదరాబాద్‌ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో తన భర్త చైతన్యతో విడాకులకు నిహారిక అప్లై చేసింది. కాగా, 2020 డిసెంబరులో టెక్ అఫిషియల్ చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకుంది. ఉదయ్‌పుర్ వేదికగా ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి.. మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అయితే, నిహారిక కొణిదెల – జొన్నలగడ్డ చైతన్య దంపతుల మధ్య అసలు ఎందుకు సమస్య వచ్చింది అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ విడాకులకు ప్రధాన కారణం.. నిహారిక ప్రవర్తనే అని తెలుస్తోంది.

నిహారిక గతంలో ఓ పబ్ లో ఓవర్ టైమ్ లో ఉండి, పోలీసులకు చిక్కింది. అప్పటి నుంచి నిహారిక – చైతన్య జొన్నలగడ్డ మధ్య గొడవలు జరుగుతున్నాయి అని తెలుస్తోంది. ఆ తర్వాత కూడా నిహారిక ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడం, పైగా నిహారిక పలు వెబ్ సిరీస్ ల్లో నటించడం, వాటిల్లో కూడా కొన్ని బోల్డ్ సీన్స్ ఉండటం.. మొత్తానికి నిహారికతో చైతన్య జొన్నలగడ్డ విడిపోవాలని నిర్ణయంచుకున్నాడు. పైగా ఇద్దరు అంగీకారంతో విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.

Also read:Chiranjeevi:’భోళా శంకర్’ షూటింగ్ పూర్తి

అయితే మొదటగా విడాకుల కోసం జొన్నలగడ్డ చైతన్యనే పిటిషన్ దాఖలు చేశాడు. అనంతరం నిహారిక తరఫున అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా పిటిషన్ వేశారు. దిలీప్.. నాగబాబుకు దగ్గర వ్యక్తి. అందుకే గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. పైగా అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర జనసేన తరుపున నిత్యం యూట్యూబ్ లో వీడియోలు కూడా చేస్తుంటాడు. ఏది అయితే ఏం.. నిహారిక – చైతన్య తమ వివాహ బంధానికి ముగింపు పలికారు.

Also Read:‘ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి..

- Advertisement -