ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉండనుందన్నారు మంత్రి హరీశ్ రావు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా ఇంటి నుండి జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామీ దేవాలయం కు బయల్దేరారు హరీశ్. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీ కి బయల్దేరనున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్..తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్ష కు అనుగుణంగా ఉంటుందన్ఆరు. కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని..సంక్షేమానికి అభివృద్ధి రెండు జొడేద్దుల్లగా సమపాళ్లలో ఉండబోతోందన్నారు. కేంద్రం నుండి వివక్ష కొనసాగుతుంటే, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశాం అన్నారు.
తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోందని…దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచిందన్నారు. సభలో నేను, మండలి లో ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెడుతారని…బడ్జెట్ నిన్న కేబినేట్ ఆమోదం తో పాటు గవర్నర్ ఆమోదం కూడా లభించిందన్నారు.
ఇవి కూడా చదవండి..