ఈ గుర్రం ధర తెలిస్తే షాకే!

11
- Advertisement -

మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో ఘనంగా నిర్వహించిన చేతక్ ఉత్సవం ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణలతో సందడి చేసింది. దేశం నలుమూలల నుంచి అరుదైన, విలువైన గుర్రాలను తీసుకువచ్చిన యజమానులు ఈ మహోత్సవానికి ప్రత్యేక అందాన్ని తెచ్చారు. వాటిలో వైట్ కోబ్రా అనే గుర్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.

రూ.1.71 కోట్ల విలువ కలిగిన ఈ వైట్ కోబ్రా గుర్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 61 అంగుళాల ఎత్తుతో మెరిసే ఇది అసలైన రాజసం, శౌర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. నూక్రా జాతికి చెందిన ఈ గుర్రానికి ప్రతి నెలా రూ.75 వేలు వరకు ఖర్చవుతుందని యజమాని చెబుతున్నారు. ఆహారం నుంచి సంరక్షణ వరకూ ఈ గుర్రం కోసం ప్రత్యేక బడ్జెట్ ఉంచాల్సిందే.

నూక్రా జాతి గుర్రాలు శక్తి, వేగం, అందంతో ప్రసిద్ధి పొందాయి. అందుకే వైట్ కోబ్రా సంతానానికి భారీ డిమాండ్ ఉంది. దాని వంశం నుండి పుట్టే పిల్ల గుర్రాలు మార్కెట్లోనే కోటి రూపాయల ధరలకు అమ్ముడవుతున్నాయి.

ఈ ఉత్సవంలో మరో ఆకర్షణ రుద్రాణి అనే గుర్రం. దాని విలువ కూడా కోటి రూపాయలకుపైగానే ఉండటంతో సందర్శకులు ఆశ్చర్యపోయారు. మొత్తం చేతక్ ఉత్సవం అరుదైన గుర్రాల జాతులను చూడాలని వచ్చే ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది.

Also Read:SSC Exams:పదో తరగతి పరీక్షల షెడ్యూల్

- Advertisement -