మూత్రపిండాలు మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలోనూ రక్తాన్ని శుబ్రపరచడంలోనూ ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి కిడ్నీల పనితీరు ఏ మాత్రం మందగించిన.. మొత్తం ఆరోగ్యంపైనే ప్రభావం పడుతుంది. అందుకే కిడ్నీల ఆరోగ్య సంరక్షణ ఎంతో ముఖ్యమని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే వీటి పనితీరు మందగించడానికి కొన్ని రకాల అలవాట్లే ప్రధాన కారణం. అవేంటో తెలుసుకుందాం !
నాన్ వెజ్ ఎక్కువగా తినడం
చాలమంది నాన్ వెజ్ ఎక్కువగా తింటూ ఉంటారు. కొందరు ప్రతిరోజూ కూడా మాంసాహారనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఇలా మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరిగి కిడ్నీలు పాడవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
టాబ్లెట్లు అధికంగా వాడటం
టాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగించిన కిడ్నీలు దెబ్బ తింటాయట. కొందరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా టాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొందరు ప్రతిరోజూ 3-5 రకాల టాబ్లెట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. ఇలా ఎక్కువగా ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కిడ్నీల పని తీరు మందగిస్తుందట.
ఉప్పు
తినే ఆహారంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉపయోగించే వారిలో కూడా తరచూ కిడ్నీ వ్యాధుల పరిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉప్పులో ఉండే సోడియం కారణంగా దీని శాతం ఎక్కువైతే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉందట.
ఇంకా నీళ్ళు తక్కువగా తాగడం, మూత్ర విసర్జనను ఆపుకోవడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల కారణంగా కూడా కిడ్నీలు దెబ్బ తింటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ అలవాట్ల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించడం ఎంతో మంచిది.
Also Read:ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పోన్ నెంబర్స్!