సింగర్ శంకర్ మహదేవన్ తన పాటలతో ఉర్రూతలూగిస్తాడు. అటువంటి సింగర్ ఓ కూలీని మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకుంది కేరళకు చెందిన రాకేశ్ అనే ఓ కూలీని. మెచ్చుకోవడమే కాదు.. ఆ కూలీ పాడిన పాటకు ఫిదా అయిపోయాడు. ఆ కూలీ ‘విశ్వరూపం’ సినిమాలోని ఉనయ్ కానధు నాన్ అనే పాటను పాడుతుండగా అతడి స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ కూలీ గొంతు అద్భుతంగా ఉండడంతో నెటిజన్లు విపరీతంగా షేర్లు చేయడంతో ఈ విషయం శంకర్ మహదేవన్ దృష్టికి వచ్చింది.
ఆ పాట ఒరిజినల్ సింగ్ శంకర్ మహదేవన్. అయితే ఆ కూలీ పాడిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేసి ఇంత మంచి వాయిస్ ఉన్న వ్యక్తితో కలిసి పనిచేయాలనుంది అని ట్వీట్ చేశాడు. అతడు ఎవరో ఎక్కడుంటారో అడిగి అనంతరం ఆ కూలీ ఫోన్ నెంబర్‌ను తెలుసుకుని మరీ ఫోన్ చేశారు శంకర్ మహదేవన్.
“ఇది నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. నా వాయిస్ బాగుందని శంకర్ గారు చెప్పారు. నీకు మంచి ఫ్యూచర్ ఉందన్నారు. మిమ్మల్ని ఒక్కసారి చూడాలనుందని ఆయనతో అన్నాను. దీంతో నన్ను చూడటం కాదు.. త్వరలోనే ఇద్దరం కలిసి పాట పాడతాం అని చెప్పాడు..”అని హర్షం వ్యక్తం చేశాడు రాకేశ్.
This is called fruit of labour!
When we hear this, it just makes me feel so so proud of our country that produces so much talent and is so rich in culture. Who is this guy???
How can I trace him?
Need help & would like to work with him. pic.twitter.com/SWqGQkmChb— Shankar Mahadevan (@Shankar_Live) June 30, 2018