ప్రజల కోసమే..థర్డ్ ఫ్రంట్

192
- Advertisement -

దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ దేశంలో ఎన్ని సహజ వనరులున్నా ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. గుణాత్మక మార్పు కోసం తొలి అడుగుపడిందన్నారు. ఈ 70 ఏళ్లలో ఏంజరిగిందో ప్రజలకు తెలుసన్నారు.ప్రజల అవసరాలు తీర్చడంలో బీజేపీ,కాంగ్రెస్ విఫలమయ్యారని ఆరోపించారు. థర్డ్ ఫ్రంట్ రాజకీయాల కోసం కాదు..ప్రజల కోసమని తెలిపారు. భవిష్యత్‌లో మాదే అతిపెద్ద కూటమిగా ఆవిర్భవించబోతుందని తెలిపారు.

దేశంలో మార్పుకు ఇదే సరైన సమయమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపింది. ఇది తొలి అడుగుమాత్రమేనని మరికొంతమందిని కలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఒక శుభపరిణామంగా భావిస్తున్నానని తెలిపింది. చాలామంది మిత్రులు కలిసివస్తారని…భావసారుప్యత కలిగిన వారితో చర్చిస్తామని తెలిపింది.దేశాభివృద్ధి, రైతులు,వ్యవసాయం అన్ని అంశాలపై చర్చజరిగిందన్నారు.

mamatha

దాదాపు రెండు గంటలపాటు సీఎం కేసీఆర్-మమతా భేటీ జరిగింది. ఈ భేటీలో థర్డ్ ఫ్రంట్‌కు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఎంపీ కేశవరావు,కవితతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

- Advertisement -