ఐటీఐఆర్ లేకున్నా…ఐటీ రంగం ఆగలే!

46
- Advertisement -

రాజకీయంగా బీజేపీతో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రయోజనాలను అడ్డుకుంది మోడీ సర్కార్‌. ఇందులో భాగంగా ఒకటి హైదరాబాద్‌కు ఐటిఐఆర్. 2008 లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదన చేసి, 2013లో దానికి ఆమోదం తెలిపినా, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణకు శనిలా దాపురించిన మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హమీల మాదిరి హైదరాబాద్ ఐటీఐఆర్‌ను కూడా మూలకుపెట్టింది.

ఇక ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కొల్పొయినా, మంత్రి కేటీఆర్ ఉక్కు సంకల్పం ముందు ఇప్పుడు చిన్నబోయింది. గత 9 సంవత్సరాల్లో కేటీఆర్ చొరవ, సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు వెల్లువలా వచ్చాయి. ఫలితంగా ఏడాదికి ఏడాది ఐటీ ఎగుమతులు పెరుగుతు వస్తున్నాయి. 2014లో 56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండగా 2023 వచ్చే సరికి ఐటీ ఎగుమతులు రూ.2.41 లక్షలకు చేరుకున్నాయి. కేంద్రం ఐటీఐఆర్ ఇవ్వకుండా మొండిచేయి చూపించిన దేశంలోనే అగ్రస్ధాయికి ఎదిగింది తెలంగాణ ఐటీ.

Also Read:స్వాతంత్య్ర స్పూర్తిని నింపిన నేతాజీ..

ఒకవేళ రాష్ట్రానికి ఐటీఐఆర్ వచ్చి ఉంటే 2032 వరకు ఐటీ ఎగుమతులు రూ.2.5 లక్షల కోట్లకు చేరుకునేవి. కానీ తెలంగాణకు ఐటీఐఆర్ లేకున్నా కేటీఆర్ ఉన్నారని అందుకే ఆ లక్ష్యాన్ని 9 సంవత్సరాల ముందే చేరుకున్నామని వెల్లడించారు తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ ఛైరన్ జగన్ మోహన్ రావు. ప్రభుత్వం ఉక్కు సంకల్పంతోనే ఇది సాధ్యమైందన్నారు. 2014లో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐటీలో ఘణనీయమైన వృద్ధి సాధించామని…అందుకే ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని వెల్లడించారు. తైవాన్ అనే చిన్న దేశం నుండి కూడా తెలంగాణ పెట్టుబడులు సాధిస్తుందంటే ఐటీలో ఎంత వేగంగా ప్రగతి సాధిస్తున్నామో ఉదాహరణ అన్నారు. ఫాక్స్ కాన్ అనే తైవాన్ కంపెనీ ద్వారా 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇవాళ తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందంటే కేటీఆర్ ప్రతిభ,సీఎం కేసీఆర్ ముందుచూపే కారణమన్నారు.

ఐటీ కంపెనీలకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయడానికి తెలంగాణ ‘3ఐ’ మంత్రాన్ని అవలంబిస్తోంది. 3ఐ అంటే మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధి, ఆవిష్కరణ.అలాగే టైర్ 2 నగరాల్లో IT పరిశ్రమను ప్రోత్సహించడం, సామాజిక, మొబైల్, అనలిటిక్స్, క్లౌడ్, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి కొత్త సాంకేతిక రంగాలపై దృష్టి సారించడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.

Also Read:ప్రపంచ అవయవ దాన దినోత్సవం..

- Advertisement -