ప్రధానమంత్రి ముద్ర లోన్ కు.. అప్లై చేసుకోండిలా!

33
- Advertisement -

చాలమంది వ్యాపారం చేయడానికి సరైన పెట్టుబడి లేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయాల్లో బ్యాంకుల ద్వారనో లేదా ఇతర లోన్ ఏజెన్సీ ల ద్వారానో లోన్ పొంది.. ఆ తరువావ వ్యాపారాన్ని ప్రారంభిస్తుంటారు. అయితే బ్యాంక్ ల ద్వారా తీసుకునే లోన్ ఎన్నో కండిషన్స్ మరియు షరతులను కలిగిఉంటుంది. అలాగే ఏజెన్సీల ద్వారా తీసుకునే లోన్ కూడా ఎన్నో కండిషన్స్ తో పాటు వడ్డీ రేటు కూడా అధికంగానే ఉంటుంది. అయినప్పటికి అవసరం నిమిత్తం లోన్ తీసుకోకతప్పదు. అయితే ఏదైనా వ్యాపారం నిమిత్తం లోన్ పొందాలనుకునే వారికి ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికైనా వ్యాపారం నిమిత్తం కేంద్ర ప్రభుత్వమే లోన్ మంజూరు చేయడం. ఈ ముద్రా లోన్ ద్వారా నాన్ కార్పొరేట్, నాన్ ఫార్మ్, సూక్ష్మ వ్యాపారులకు 10 లక్షల వరకు లోన్ మంజూరు అవుతుంది. మరి ఈ యొక్క ముద్రా లోన్ కు ఎవరు అర్హులు ? ఎలా దరఖాస్తు చేసుకోవాలి ? దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ? అనే విషయాలను తెలుసుకుందాం !.

ముద్రాలోన్ కి ( WWW.UDYAMIMITRA.IN ) అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముద్రా లోన్ లో శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు రకాలు ఉంటాయి. శిశు లో రూ. 50 వేలు ( దాదాపు ), కిషోర్ లో రూ.50 వేలు నుంచి రూ. 5 లక్షలు ( దాదాపు ), తరుణ్ లో రూ. 5 లక్షలు నుంచి రూ.10 లక్షలు ( దాదాపు ) మంజూరు అవుతుంది.

ముద్రా లోన్ అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్

* ఫోటో ఐడి ఫ్రూఫ్
* అడ్రస్ ఫ్రూఫ్
* ITR సర్టిఫికేట్ ( గత 2 సంవత్సరాది )
* గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్
* నివాసం లేదా కార్యలయం దృవ పత్రం
* ట్రేడ్ రిఫరెన్స్ సర్టిఫికేట్
* ప్రాజెక్ట్ రిపోర్ట్
( ప్రాజెక్ట్ రిపోర్ట్ అనగా మీరు చేసే వ్యాపారానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం )

18 – 65 ఏళ్ల మద్య వయసు ఉన్న ప్రతి భారతీయ పౌరులు ఈ ముద్రా లోన్ కు అప్లై చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -