1.జీలకర్ర ను నీటిలో వేసి రసం తీసి ఆ రసాన్ని 3 పూటాలా ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది
2.మెంతుల్ని మెత్తగా పొడి చేసి పూటకు ఒక స్పూను చొప్పున నీటితో మింగాలి.ఇలా రోజుకు రెండుసార్లు తాగితే ఉబ్బరం తగ్గుతుంది.
3.జీడి మామిడి పండ్లు కొన్ని తీసుకొని వాటి రసం ఒక కప్పులో పోసి ఒకే మోతదు గా తాగాలి .రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
4.పిప్పళ్ళు తీసుకుని బాగా దంచి చూర్ణం చేసి దానిలో అర స్పూన్ చూర్ణా నికి ఒక స్పూన్ తేనే కలిపి రోజూ మూడు పూటలా వాడుతుంటే కడుపుబ్బరం తగ్గుతుంది
5.జాజికాయ ,జాపత్రి ,శొంఠి ,లవంగాలు, యాలకాలు, చలవ మిరయాలు, సాంబ్రాణి మృదారు చిన్ని వీటిన్నిటినీ సమాభాగాలుగా తీసుకొని బాగా చూర్ణం చేసుకొని జల్లించి అర స్పూన్ చొప్పున ప్రతి రోజు రెండు పూటలా తీసుకుంటే కడుపుబ్బరం వ్యాధి తగ్గుతుంది.
6.మారేడు ఆకులు రసం రెండు స్పూన్లు తీసుకొని దానిలో నాలుగు మిరియాలు చూర్ణం చేసి కలిపి తాగితే కడుపుబ్బరం తగ్గిపోతుంది.
7.ఒక పసుపు కొమ్మును ఒక కప్పు పాలలో వేసి దాన్ని బాగా మరిగకాచి చలార్చి వడగట్టి ఆ పాలను ఉదయం,సాయత్రం తాగుతూ ఉంటే కడుపుబ్బరం తగ్గిపోతుంది.
8. ఒక గ్లాస్ పాలు తీసుకుని దానిలో కొంచెం నేల ఉసిరి ఆకులు వేసి బాగా మరిగించి ఆ పాలను వడగట్టి తాగుతుంటే కడుపుబ్బరం తగ్గుతుంది.
9.శనగ గింజంత ఇంగువను రోజూ మూడు పూటలా తీసుకుంటే కడుపుబ్బరం తగ్గుతుంది
10. ప్రతి ఆరు గంటలకొక సారి నాలుగు వెల్లుల్లి రేకల్ని నమిలి మింగితే ఉబ్బురోగం తగ్గిపోతుంది.అలాగే పచ్చి కాకరకాయ రసం ప్రతి రోజు ఉదయం ,సాయంత్రం ఒక స్పూన్ చొప్పునా తీసుకొవాలి.
ఇవి కూడా చదవండి..