‘గుంటూరు కారం’లో అక్కడే తేడా

48
- Advertisement -

ఏం జ‌రుగుతుందో తెలియ‌దు కానీ గ‌త కొన్నాళ్లుగా గుంటూరు కారం సినిమా వార్త‌ల్లో తెగ నిలుస్తోంది. ఈ సినిమా క‌థ మార్చార‌ని కొంత‌మంది, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని మారుస్తార‌ని మ‌రికొంద‌రు నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. మొత్తానికి అనుకున్నట్టే జరిగింది. ఈ సినిమాకు సంగీతం ఇస్తున్న‌ థ‌మ‌న్.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం థ‌మ‌న్ మూడు ట్యూన్లు ఇచ్చాడు. ఈ మూడు ట్యూన్లు మహేష్ కి నచ్చలేదు. ఐతే, త్రివిక్రమ్ రిక్వెస్ట్ చేయడంతో.. మహేష్ మళ్లీ ట్యూన్లు చేయమని చెప్పాడు. మహేష్ మాటను కాదు అనలేక, థ‌మ‌న్ కూడా ఆ మూడు ట్యూన్లను మళ్లీ చేశాడు.

కానీ, మళ్ళీ ఆ మూడు ట్యూన్లు మహేష్ కి నచ్చలేదు. దీంతో త్రివిక్రమ్ కూడా చేతులు ఎత్తేశాడు. ఇక చేసేదేం లేక, ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి థ‌మ‌న్‌ ను తీసేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. పైగా, థ‌మ‌న్‌ ప్లేస్‌ లోకి త‌మిళ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ రానున్నాడ‌ని కూడా తెలుస్తోంది. ఐతే, ఈ విష‌యంలో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాత నాగ‌వంశీ, హీరో మ‌హేష్ బాబును సోష‌ల్ మీడియాలో అన్‌ ఫాలో అయ్యాడు.

Also Read: Karthikeya: మను చరిత్ర గ్రాండ్ సక్సెస్

ఇప్పుడు ఇది కూడా హాట్ టాపిక్ ఆవుతుంది. నిర్మాత నాగ‌వంశీకి, హీరో మ‌హేష్ బాబుకు మధ్య ఏం జరిగింది ? అంటూ చర్చ మొదలుపెట్టారు. మొదటి నుంచి గుంటూరు కారం టీమ్ మ‌ధ్య తేడా జరుగుతూనే ఉంది. ఈ సినిమా విషయంలో మ‌హేష్ బాబు ఎందుకో నమ్మకంగా లేడు. తన తర్వాత సినిమాని మహేష్ రాజమౌళితో చేస్తున్నాడు. కాబట్టి, ఈ సినిమా కూడా ఆ సినిమా స్థాయిలోనే ఉండాలని ఆశపడుతున్నాడు. అక్కడే కొడుతోంది తేడా.

Also Read: రైటర్‌ కు ప్రాణహాని.. అటు క్షమాపణలు

- Advertisement -