దేశంలో శాశ్వత రాజకీయ నాయకులు ఎవరూ ఉండరన్నారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ప్రజలకు ఎవరు మేలు చేస్తే వాల్లే రాజకీయాల్లో ఉంటారన్నారు. నేడు హైదరాబాద్ లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మంత్రి కేటీఆర్ , డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరయ్యి అవార్డులను ప్రధానం చేశారు. విధి నిర్వహణలో ఉత్తమమైన ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డులను అందజేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 13మంది అధికారులకు ఈ అవార్డులను అందజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు అధికారుల కృషి ఎంతో అవసరమన్నారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి.
ప్రజల సమస్యలు అర్ధం చేసుకున్న వాళ్లే అసలైన రాజకీయ నాయకులన్నారు మంత్రి కేటీఆర్. ప్రజలకు ఎవరి పాలన నచ్చితే వాళ్లకే ఓట్లు వేసి గెలిపిస్తారన్నారు. శాశ్వత రాజకీయ నాయకులు ఎవరూ ఉండరని…ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకుంటేనే నాయకులవుతారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎలాంటి ఫౌండేషన్ కోర్సులు ఉండవన్నారు. ప్రజల మనసు గెలుస్తే వాళ్లే మనల్ని నాయకులుగా నిలబెడతారన్నారు. పరిస్ధితులు అర్ధం చేసుకోవాడానికి ఎవరికైనా కొంచెం సమయం పడుతుందన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిస్ధితుల్లి అర్ధం చేసుకోవడానికి సంవత్సర కాలం పట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృధ్ది, సంక్షేమ పథకాలతో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందన్నారు. టిఎస్ ఐపాస్ తో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.