The GOAT: విజ‌య్ బ‌ర్త్‌డే ట్రీట్‌..

13
- Advertisement -

ఇళయ దళపతి విజయ్ బర్త్ డే నేడు. దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇవాళ విజయ్ బర్త్ డే సందర్భంగా ది గోట్ మూవీ నుండి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

50 సెకన్ల గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంది. విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తుండగా ఇద్ద‌రు విజ‌య్‌లు బైక్‌పై వెలుతుంటే విల‌న్స్ ఛేజింగ్ చేసే సీన్ అద్భుతంగా ఉంది. యువ‌న్ శంక‌ర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోరు చాలా బాగుంది. డైలాగ్స్‌ లేకుండా యాక్షన్ సన్నివేశాలనే హైలెట్ చేస్తూ సాగిన ఈ గ్లింప్స్ వైర‌ల్‌గా మారింది. సెప్టెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Also Read:కల్కి 2898 AD.. రిలీజ్ ట్రైలర్

- Advertisement -