జోడో యాత్రలో దొంగలున్నారు జాగ్రత్త.!

138
rahul
- Advertisement -

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. మనకు కన్పించకుండా దొంగలున్నారు జాగ్రత్త. నమ్మలేకుపోతున్నారా? ఇది చదివితే మీకే అర్థమవుతుంది. సందట్లో సడేమియా అనేలా భారత్ జోడో యాత్రలో దొంగల తీరు. తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీని చూడాలని ఆత్రుతతో భారీ ఎత్తున తరలివచ్చే జనం ఆరాటాన్ని దొంగలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

ఆదివారం ఉదయం రాహుల్ గాంధీని చూసేందుకు గొల్లపల్లి సమీపంలోకి వచ్చిన జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన బాబర్ ఖాన్ జేబులో నుండి రూ. 54000, గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి నుండి 74 వేల రూపాయలు కొట్టివేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.కాగా యాత్ర సాగిన ప్రతిచోట చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పలువురు నగదుతోపాటు, సెల్ ఫోన్లను కోల్పోయినట్లు సమాచారం. రాహుల్ గాంధీ నవంబర్ 7 వరకు కొనసాగునుంది.

ఇవి కూడా చదవండి

రాజగోపాల్ రెడ్డి మాటాలన్ని బూటకాలె.!

సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

జోడో జోష్‌…పాదయాత్రలో పరుగులు

- Advertisement -