కోలీవుడ్‌లో పాగా వేసిన షాలిని..

211
Theatre helps me a lot
- Advertisement -

అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిన అందాల భామ షాలిని పాండే. ఈ చిత్రంలో షాలిని నటనకి టాలీవుడే కాదు కోలీవుడ్ కూడా ఫిదా అయింది. ముఖ్యంగా యూత్‌ని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో అర్జున్ స్టార్స్ విజయ్ దేవర కొండ, షాలినిలకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

వీరిద్దరు ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక ఇటు టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లో సైతం బిజి ఆర్టిస్ట్‌గా మారిపోయింది షాలిని. తమిళంలో జీవీ ప్రకాశ్‌ హీరోగా నటిస్తున్న ‘100% కాదల్‌’ చిత్రంతో పాటు జీవా హీరోగా చేస్తున్న ‘గొరిల్లా’లోను హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, త్వ‌ర‌లోనే విడుద‌లకి సిద్ధ‌మ‌వుతున్నాయి.

Theatre helps me a lot

‘100% కాదల్‌’ చిత్రం తెలుగులో వ‌చ్చిన 100% ల‌వ్ చిత్రానికి రీమేక్ కాగా ‘గొరిల్లా’ చిత్రంలో నిజ‌మైన చింపాజీ న‌టిస్తుండ‌గా, దీనితో చిత్ర హీరో, హీరోయిన్స్ స్నేహం చేస్తున్నార‌ట‌. థాయ్‌లాండ్ బాష‌లో కొన్ని ప‌దాలు కూడా నేర్చుకున్నార‌ట‌. చింపాంజితో కలిసి నటించేందుకు ప్రారంభంలో కాస్త భయపడినా తర్వాత ఎలాంటి బెరుకూ లేకుండా నటించేసిందట షాలిని. దీంతో పాటు మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి చిత్రంలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. ఇటు నటిగానే కాకుండా సింగర్‌గానూ తన అదష్టాన్ని పరీక్షించుకుంటున్న షాలిని ప్రేక్షకులను మరింతగా అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -