మన శరీరానికి సరైన పోషకాలు అందాలంటే మనం తినే ఆహారంలో అధికంగా ఆకు కూరలు లేదా కూరగాయలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అధికంగా తినే జంక్ ఫుడ్ కన్నా సహజంగా లభించే కూరగాయల మన శరీరానికి అధిక ప్రయోజనలు కలుగుతాయి. అయితే కూరగాయలలో కొన్ని కూరగాయలను తినడానికి కొంత మంది ఆసక్తి చూపరు.
కానీ మాంసాకృత్తులతో పోలీస్తే కూరగాయాల్లో ఎన్నో విటమిన్లు, పోషక విలువలు ఉంటాయి. ఒక్కో కూరగాయ ఒక్కో ప్రత్యేకతను కలిగిఉంటుంది. కొన్ని సీ విటమిన్లను అందిస్తే మరికొన్ని ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అంతేగాదు ముఖ్యంగా కూరగాయల అరుగుదల సమయం చాలా తక్కువ. మనం తీసుకున్న కూరగాయల ఆహారం కేవలం 30 నుండి 40 నిమిషాల్లోనే జీర్ణం అవుతుంది.
Also Read:ఎండు కొబ్బరితో గుండె సమస్యలకు చెక్!
ఇక ముఖ్యంగా బెండకాయలో ఉండే జిగురు పదార్థం మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్దీకరిస్తుంది. ఇక బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.తద్వారా మలబద్దకం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా పెద్ద పేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారు బెండకాయ కూర తినడం ఉత్తమం అని నిపుణులు సైతం చెబుతున్నారు. కాబట్టి వారంలో మెజార్టీ సార్లు మీ మెనులో కూరగాయాలు ఉండేలా చూసుకోండి..