నేటి రోజుల్లో చాలమందికి అధిక బరువును తగ్గించుకోవడం ఒక పెద్ద టాస్క్ లా మారింది. మారుతున్న ఆహారపు అలవాట్ల కరణంగానో లేదా తినే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనో చాలా త్వరగా బరువు పెరిగేస్తూ ఉంటారు చాలమంది. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఆల్కహాల్, చికెన్, మటన్.. వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని తెలిసినా వాటిని తీసుకోవడం మాత్రం తగ్గించారు. అన్నిటికన్నా ముఖ్యం అధిక బరువు ఉన్నవారిలో పొట్ట చుట్టూ కొవ్వు ఏర్పడి, ఎంతో ముందరికి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలా పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏ చిన్న పని చేయడానికి కూడా అలసటగా ఫీల్ అవుతూ ఉంటారు.
నలుగురితో తిరగడానికి కూడా నామోషిగా భావిస్తూ ఉంటారు. దాంతో పొట్ట తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా వ్యాయామం చేయడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ కొద్ది సేపు వ్యాయామం చేయగానే అలసట ఏర్పడి వ్యాయామం కూడా సరిగా చేయలేరు. అలాంటి వారు ప్రతిరోజూ ఒక అరగంట ఫ్లాంక్స్ ( యోగాలో ఒక ఆసనం ) వేస్తే చాలా తక్కువ రోజుల్లోనే పొట్ట చుట్టూ ఉండే కొవ్వంతా కరిగి నాజూకుగా మారతారు. ప్లాంక్స్ వేయడం వల్ల కేవలం పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరగడం తో పాటు ఇంకా చాలానే ప్రయోజనలు ఉన్నాయి. ఉదర కండరాలు బలపడతాయి అలాగే కాళ్ళు చేతులు శక్తినొందుతాయి. చేసే పని పై ఏకాగ్రత ఏర్పడుతుంది. రోజంగా యాక్టివ్ గా ఉండడానికి దోహదం చేస్తుంది. కాబట్టి స్త్రీ పురుషులు ఎవరైనా.. ప్రతిరోజూ ఒక అరగంట పాటు ‘ ప్లాంక్స్ వేస్తే ” ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read:జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్
ఫ్లాంక్స్ వేయు విధానం
ముందుగా మ్యాట్ పై బోర్లా పడుకొని చిత్రంలో చూపిన విధంగా చేతులను 90 డిగ్రీల కోణంలో మోచేతుల వరకు మడిచి నేలకు తాకేల పెట్టాలి. కాళ్ళను నిటారుగా చాపి కాలివేళ్ళను నేలకు ఆనించాలి. ఆ తరువాత మోచేతులు మరియు కాలివేళ్ళపై శరీరభారాన్ని మోపుతూ.. శరీరానికి వీలైనంతా పైకి లేపాలి. ఇలా చేస్తున్న క్రమంలో పిరుదులు మరియు పొట్ట భాగాన్ని పట్టి ఉంచాలి. ఇలా వీలైనంతా సమయం చేయాలి.