ఇవి పాటిస్తే.. బాడీ ఫిట్‌నెస్ సూపర్!

63
- Advertisement -

అందమైన శరీరాకృతి కావాలని ఎవరికి ఉండదు.. ప్రతిఒక్కరికి ఉంటుంది. తమ శరీరానికి ఒక పర్ఫెక్ట్ రూపు ఉండాలని, అందరిలోనూ బాగా కనిపించాలని స్త్రీపురుషులు ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే చాలమంది పెళ్ళికి ముందు బాడీ ఫిట్నెస్ ఎంతో శ్రద్ద పెడుతూఉంటారు. కానీ పెళ్లి తరువాత ఫిట్నెస్ పై దృష్టి పెట్టారు కారణం.. కుటుంబ బాధ్యతలు పెరిగిపోవడం, పనిపై ఒత్తిడి పెరిగి వ్యాయామం చేయడానికి తీరిక లేకపోవడం వంటి కారణాలతో ఫిట్ నెస్ పై శ్రద్ద తగ్గుతుంది. తద్వారా ఫిట్ బాడీ కాస్త ఫ్యాట్ బాడీగా మారుతుంది. అయితే పెళ్లి తరువాత కూడా ఫిట్ నెస్ కోసం కొంత సమయం కేటాయిస్తూ కొన్ని నియమాలు పాటిస్తే చక్కటి శరీరకృతి మీ సొంతం అవుతుంది. అవేంటో తెలుసుకుందాం.

బాడీ ఫిట్ గా ఉంచుకునేందుకు వ్యయమనికి సమయం కేటాయించడం ఎంతో అవసరం. వారానికి కనీసం 5 రోజులైనా వ్యాయామం చేస్తే మంచిది. రోజుకు 30 నిముషాల నుంచి 40 నిముషాల వరకు తీవ్రమైన వ్యాయామం చేస్తే శరీరం లోని కొలెస్ట్రాల్ శాతం తగ్గి బాడీ ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో పాటు చక్కటి శరీరాకృతి కూడా సొంతం అవుతుంది. ఇక చాలమంది పని ఒత్తిడిలో బాడీకి కావలసిన లిక్విడ్స్ అనగా నీరు, జ్యూస్ వంటివి చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా నీరు సమృద్దిగా తాగుతూ.. పండ్ల రసాలు, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి తాగుతూ ఉంటే బాడీలో తేమ శాతం మెండుగా ఉండి.. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

Also Read:రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా..

తద్వారా కొలెస్ట్రాల్ పెరగదు. ఇక మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు మన ఆహార డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ( మొలకెత్తిన విత్తనాలు, గుడ్లు, చికెన్, మటన్.. వంటివి ) ఇక రోజులో ఆహారం ఒకేసారి ఎక్కువగా తీసుకోకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాడీ ఫిట్ నెస్ నిద్ర చాలా అవసరం రోజుకు కనీసం 6-8 గంటలు ఖచ్చితంగా గాఢనిద్ర పోవడం వల్ల బాడీ లోని అన్నీ ఆర్గాన్స్ కు విశ్రాంతి లభించి.. మరింత యాక్టివ్ గా పని చేసేందుకు వీలుంటుంది. కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా పాటిస్తే ఆకర్షణీయమైన శరీరాకృతితో బాడీని ఫిట్ గా ఉంచుకోవచ్చు.

- Advertisement -