నేటి రోజుల్లో ఆడవారికంటే మగవారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి సమస్యలలో మగవారే ఎక్కువగా బాధ పడుతున్నారు. స్పార్మ్ కౌంట్ తక్కువగా ఉండడం, శృంగారంలో ఆసక్తి చూపకపోవడం, అంగస్తంభన, శిగ్రస్కలనం.. ఇలా మగవాళ్ళను వేధించే సమస్యలు చాలానే ఉన్నాయి. ఈ సమస్యలు చుట్టుముట్టడానికి కారణాలు కూడా ఎక్కువే. గంటల తరబడి కంప్యూటర్స్ ముందు కూర్చొని పని చేయడం, తినే ఆహారం విషయంలో శ్రద్ద చూపకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల శృంగార సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు పురుషులు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా తినే ఆహారంలో టెస్టోస్టిరాన్ పెంచే పదార్థాలు ఎక్కువగా తింటే ఎలాంటి ప్రత్యుత్పత్తి సమస్యలనైనా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నా మాట. మరి మగవారిలో టెస్టోస్టిరాన్ పదార్థాలు ఏవో తెలుసుకుందాం !
వెల్లుల్లి
ప్రతిరోజు రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్తేజానికి గురి అవుతుందట. ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే పోషకాలు పురుషులలో శుక్ర కణాలను విడుదల చేయడానికి దోహద పడతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తినే ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవలట.
దానిమ్మ
దానిమ్మ పండు మంచి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్స్ పురుషులకు స్పార్మ్ కౌంట్ ను పెంచడంతో పాటు ఎముకల దృఢత్వం, కండరాలను బలపరచడం చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ పురుషుల్లో వచ్చే ఎలాంటి శృంగార సమస్యలనైనా దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లు
మగవారిలో ప్రోటీన్ శాతాన్ని రెట్టింపు చేయడంలో గుడ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. గుడ్డులో మగవారి శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు, విటమిన్స్, మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా పురుషుల్లో స్పార్మ్ కౌంట్ పెరగడంతో పాటు కండర పుష్టి లభిస్తుంది.
టమోటో
టమోటా రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ, ఇ, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటివి పురుషులకు ఎంతో ముఖ్యంగా కాబట్టి టమోటా కూడా తినే ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
ఇవీ కాకుండా ఆకు కూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, వంటి వాటిని కూడా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read:సత్యదేవ్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్