జగన్ వర్సెస్ షర్మిల..ఆస్తుల కోసం లేఖాస్త్రాలు!

0
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో జగన్, షర్మిల లేఖాస్త్రాలు సంచలనంగా మారాయి. ఈ ఏడాది ఆగస్టు 27న తల్లి విజయమ్మకు, చెల్లి షర్మిలకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు జగన్ లేఖ రాశారు. తనను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే ఆస్తులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. రాజకీయంగా తనపై విమర్శలు చేస్తున్న చెల్లికి చిల్లి గవ్వ ఇవ్వనని తేల్చి చెప్పేశారు. సరస్వతి సిమెంట్స్ షేర్స్ తిరిగి ఇచ్చేయాలంటూ అమ్మ మీద, చెల్లి మీద కేసు వేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్.

ప్రేమ, ఆప్యాయతలతో నాకు బదిలీ చేసినట్లు చేసుకున్న అవగాహన ఒప్పందం, MOUలో పేర్కొన్న ఆస్తులు, ఇవన్నీ మన తండ్రి ఆదేశాలను పాక్షికంగా నెరవేర్చడం కోసం మాత్రమే. నేను పాక్షికంగా అని చెప్పడానికి కారణం సాక్షి మరియు భారతి సిమెంట్స్ లో మెజారిటీ వాటా నిలుపుకోవాలని మీరు పట్టుబడుతున్నారు కాబట్టి. ఇప్పటివరకు మీదే పైచేయి కాబట్టి నన్ను పూర్తిగా అణిచివేశారు. కాబట్టి MOUలో పేర్కొన్న విధంగా మేము ఒక పరిష్కారానికి అంగీకరించాము. మీరు నాకు అన్నయ్య కాబట్టి, కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో నా సమాన వాటాను వదులుకోవడానికి అంగీకరించాను. ఆ విధంగా, 31.08.2019న అమలు చేయబడిన MOU ప్రకారం, నాకు కొన్ని ఆస్తులు మాత్రమే కేటాయించబడ్డాయన్నారు.

మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. MOU ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఈ విధంగా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోందన్నారు షర్మిల.

తండ్రి కోరిక మేరకు చేసుకున్న MOUకు కట్టుబడి ఉండటంలో వైఎస్ జగన్ తన నైతికతను కోల్పోయారని షర్మిల తన లేఖలో పేర్కొన్నట్లు టీడీపీ తెలిపింది. చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు తనకు పూర్తి హక్కులు ఉన్నాయని, ఇవన్నీ వాస్తవాలే అని నిర్థారించేందుకు విజయమ్మ సంతకం కూడా ఉందని పేర్కొన్నారు.నా రాజకీయ జీవితం పూర్తిగా నాకు సంబంధించింది. నా వృత్తి పరమైన జీవితాన్ని నిర్దేశించడానికి నేను మిమ్మల్ని అనుమతించను. బహిరంగ వేదికలపై మీకు మరియు అవినాష్‌కు వ్యతిరేకంగా మాట్లాడకుండా నాతో మీరు సంతకం చేయించుకున్నారన్నది అసంబద్ధం. సెటిల్‌మెంట్‌కు రావాలని నాకు షరతు విధించడం అనేది కూడా పూర్తిగా అసమంజసమైందన్నారు.

Also Read:గంజాయి మత్తులో మర్డర్లు:కాంగ్రెస్ ఎమ్మెల్యే

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి సరిగ్గా 15 ఏళ్లు దాటింది. అయినా ఆస్తి తగాదాలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. వైఎస్ జగన్ పాదయాత్రలో పాలుపంచుకున్న తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు మాజీ ముఖ్యమంత్రి లీగల్ నోటీసులు పంపడం.. అన్న నిర్వాకాన్ని ప్రశ్నిస్తూ చెల్లి షర్మిల లేఖాస్త్రాలు సంధించడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్ మారింది.

- Advertisement -