ఆ ఇద్దరి విషయంలో వీడని సస్పెన్స్?

35
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లకు సంబంధించిన వ్యవహారాలు ఎంతటి హాట్ టాపిక్ అవుతున్నాయో అందరికి తెలిసిందే. బి‌ఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన ఈ ఇద్దరు నేతలు తదుపరి ఏ పార్టీలో చేరతారనే చర్చ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వీరిద్దరిని చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టిగానే ప్రయత్నించగా.. వీరి అడుగులు మాత్రం కాంగ్రెస్ వైపే పడ్డాయి. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం అధికారికంగా కన్ఫర్మ్ కానప్పటికి.. దాదాపుగా ఖాయమైనట్లే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ఇద్దరు హస్తం పార్టీలో ఎప్పుడు చేరతారు ? కాంగ్రెస్ లో వీరి పాత్ర ఎలా ఉండబోతుంది ? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నెలాఖారులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.

Also Read: చంద్రబాబును టెన్షన్ పెడుతున్న పవన్ ?

ఖమ్మం, నాగర్ కర్నూల్.. వంటి జిల్లాల్లో జరగనున్న ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ జాతీయ నేతలు హాజరు కానున్నారు. ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ ఈ సభలకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి సమక్షంలోనే పొంగులేటి, జూపల్లి అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం సభలో పొంగులేటి, నాగర్ కర్నూల్ సభలో జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారట. అయితే వీరికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఉండబోతుంది అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికి. ఖమ్మం జిల్లా రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పొంగులేటికి అప్పగించే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు జూపల్లికి కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు హస్తం పార్టీ ప్లాన్ చేస్తోందట. మరి ఈ బహిష్కృత నేతల వల్ల హస్తం పార్టీకి ఎంతవరకు మైలేజ్ వస్తుందో చూడాలి.

Also Read: తృణధాన్యాలు…మోదీ ఫాల్గుణి షా పాట

- Advertisement -