నా జీవితంలో ఈరోజు మర్చిపోలేనిది: మెగాస్టార్‌

174
megastar
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌లో తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. ‘నా జీవితంలో ఆగ‌స్టు 22కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో..సెప్టెంబ‌ర్ 22కు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఆగ‌స్టు 22 నేను మ‌నిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే..సెప్టెంబ‌ర్ 22 న‌టుడిగా ‘ప్రాణం (ఖరీదు) ‘ పోసుకున్న రోజు. నా మొద‌టి సినిమా విడుద‌లైన రోజు. నన్ను ఇంత‌గా ఆద‌రించి నన్ను ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్ష‌కులంద‌రికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణ‌మైన అభిమానులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని’ చిరు ట్వీట్ చేశారు.

1955 ఆగ‌స్టు 22న కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ (చిరంజీవి) పుట్టిన‌రోజు అయితే..1978 సెప్టెంబ‌ర్ 22న సిల్వ‌ర్ స్ర్కీన్ కు న‌టుడిగా, చిరంజీవిగా ప‌రిచ‌య‌మైన రోజు. మెగాస్టార్ గా అభిమానుల నీరాజ‌నాలు అందుకున్న చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖ‌రీదు విడుద‌లై నేటితో 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అప్పటి తీపి జ్క్షాపకాలను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్‌ చిరు.

- Advertisement -