పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి : సీపీ

205
cp sajjanar
- Advertisement -

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా.. అమరవీరుల కుటుంబాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ పరామర్శించారు. స్వర్గీయ చదలవాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యుల యోగక్షేమాలను తెలుసుకున్న సీపీ సజ్జనార్ ఉమేష్ చంద్ర తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. అనంతరం పోలీస్ అమరవీరుడు కానిస్టేబుల్ ఈశ్వర్ రావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన సజ్జనార్. బాధిత కుటుంబాలకు పోలీస్ డెపార్ట్ మెంట్ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సీపీ వెంట శంషాబాద్ డిసిపి ఎన్ ప్రకాష్ రెడ్డి ఐపీఎస్, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ ఎమ్ విజయ్ కుమార్ ఐపీఎస్, డిసిపి క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ ఐపీఎస్, విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ, బాలానగర్ డిసిపి పద్మజా, మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీ మాదాపూర్ రఘునందన్ రావు, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ బాలరాజు, ఇన్ స్పెక్టర్ గురవయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -